SV Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలో హీరోయిన్ గా సౌత్ కొరియా అమ్మాయి
- చాలా కాలం తర్వాత సినిమా చేస్తున్న ఎస్వీ కృష్ణారెడ్డి
- అచ్చిరెడ్డి సమర్పణలో 'వేదవ్యాస్' చిత్రం
- హీరోగా పరిచయం అవుతున్న పిడుగు విశ్వనాథ్
టాలీవుడ్ లో డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డిది ఒక ప్రత్యేకమైన ప్రస్థానం అని చెప్పుకోవాలి. చాలా క్లీన్ సబ్జెక్ట్ తో, ఫ్యామిటీ ఎంటర్టైనర్లకు ఆయన కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించారు. తాజాగా చాలా గ్యాప్ తర్వాత ఆయన మరోసారి మెగాఫోన్ పట్టారు. తన 43 చిత్రంగా 'వేదవ్యాస్' అనే భారీ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి సమర్పణలో, సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్ పై కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో పిడుగు విశ్వనాథ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇటీవల అచ్చిరెడ్డి బర్త్‌డే సెలబ్రేషన్‌లో విశ్వనాథ్ ను ఘనంగా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సనిమా స్పెషల్ ఏమిటంటే... హీరోయిన్ గా సౌత్ కొరియన్ యాక్ట్రెస్ జున్ హ్యున్ జీ నటిస్తోంది. తెలుగు నేర్చుకుని తన పాత్రకు డబ్బింగ్ కూడా తానే చెప్పుకుంటోందట.
సాయి కుమార్, మురళీ మోహన్, సుమన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, జ్ఞానం విలువలను చాటే కథాంశంతో ఈ సినిమాను నిర్విస్తున్నారు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రాబోతోంది.