Vijay Sethupathi: జైలర్ 2లో అతిధిగా కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి

Vijay Sethupathi to Appear in Jailer 2 Guest Role
  • జైలర్‌ 2లో తాను అతిథి పాత్రలో కనిపించనున్నానన్న విజయ్ సేతుపతి
  • రజనీకాంత్‌ తనకు ఎంతో ఇష్టమైన నటుడని వెల్లడి
  • ఇటీవల విన్న కథలన్నింటిలోనూ ఎక్కువగా నెగెటివ్‌ పాత్రల కోసమే తనను సంప్రదిస్తున్నారన్న విజయ్ సేతుపతి
ముత్తువేల్ పాండియన్ పాత్రలో సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి తెరపై సందడి చేయనుండటంతో జైలర్ 2 చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తొలి భాగంతో ఘన విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందుతున్న సీక్వెల్‌లో అతిథి పాత్రల్లో ఎవరు కనిపిస్తారన్న ఉత్కంఠ నెలకొనగా, తాజాగా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ఈ చిత్రంలో భాగమవుతున్నట్లు స్వయంగా వెల్లడించారు.

జైలర్ 2లో తాను అతిథి పాత్రలో కనిపించనున్నానని విజయ్ సేతుపతి తెలిపారు. రజనీకాంత్ తనకు ఎంతో ఇష్టమైన నటుడని, ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ప్రేక్షకులకు థ్రిల్ కలిగించే స్క్రిప్ట్‌లలో మాత్రమే విలన్ లేదా అతిథి పాత్రలు చేస్తున్నానని, ఇటీవల విన్న కథలన్నింటిలోనూ ఎక్కువగా నెగెటివ్ పాత్రల కోసమే తనను సంప్రదిస్తున్నారని ఆయన వెల్లడించారు.

మొదటి భాగమైన జైలర్‌లో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్ అతిథి పాత్రల్లో మెరిసి సినిమాకు కీలక మలుపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సీక్వెల్‌లో బాలకృష్ణ కనిపించనున్నారన్న వార్తలు గతంలో హల్‌చల్ చేయగా, ఆ తర్వాత ఆయన స్థానంలో విజయ్ సేతుపతిని తీసుకున్నారని ప్రచారం జరిగింది.

ఇక జైలర్ 2లో మోహన్‌లాల్, షారుక్ ఖాన్, శివరాజ్‌కుమార్ లు కూడా అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇప్పుడు విజయ్ సేతుపతి కూడా అధికారికంగా ప్రకటించడంతో ఈ చిత్రంలోని అతిథి పాత్రలపై ఆసక్తి మరింత పెరిగింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాను జూన్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. 
Vijay Sethupathi
Jailer 2
Rajinikanth
Kollywood
Guest Role
Mohanlal
Shah Rukh Khan
Shivarajkumar
Nelson Dilipkumar
Tamil Cinema

More Telugu News