ఇన్ఫోసిస్ ఉద్యోగిని అమెరికా ప్రభుత్వం నిర్బంధించిందా? క్లారిటీ ఇచ్చిన సీఈఓ
- యూఎస్‌లో ఇన్ఫీ ఉద్యోగి నిర్బంధం వార్తలను ఖండించిన సీఈఓ సలీల్ పరేఖ్
- కొన్ని నెలల క్రితం ఒక ఉద్యోగిని వెనక్కి పంపారంతే, అరెస్ట్ చేయలేదని వెల్లడి
- సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని వెల్లడి
- డిసెంబర్ త్రైమాసికంలో 5,043 మంది కొత్త ఉద్యోగుల చేరిక
ఇన్ఫోసిస్ ఉద్యోగి ఒకరిని అమెరికా అధికారులు నిర్బంధించి, దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ పరేఖ్ తీవ్రంగా ఖండించారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
బుధవారం నాడు కంపెనీ త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ ఉద్యోగుల్లో ఎవరినీ యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు అదుపులోకి తీసుకోలేదని తెలిపారు. కొన్ని నెలల క్రితం ఒక ఉద్యోగికి అమెరికాలోకి ప్రవేశం నిరాకరించారని, ఆయన్ను తిరిగి భారత్‌కు పంపించారని, అంతే తప్ప నిర్బంధించడం లేదా బహిష్కరించడం జరగలేదని వివరించారు. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న కథనాలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు.
చేతన్ అనంతరాము అనే వ్యక్తి జనవరి 13న 'ఎక్స్' లో చేసిన ఓ పోస్ట్ వైరల్ కావడంతో ఈ ఆందోళన మొదలైంది. అమెరికాలో ఆన్‌సైట్ ప్రాజెక్టుపై పనిచేస్తున్న మైసూరుకు చెందిన ఉద్యోగిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారని, భారత్ వెళ్లడమా లేదా జైలుకు వెళ్లడమా తేల్చుకోవడానికి కేవలం రెండు గంటల సమయం ఇచ్చారని ఆ పోస్టులో ఆరోపించారు. ఫ్రాంక్‌ఫర్ట్, బెంగళూరు ప్రయాణంలో ఏజెంట్లు ఆయనను అవమానించారని, బెంగళూరు విమానాశ్రయంలో ఇన్ఫోసిస్ లాయర్లు ఆయనను కలిశారని కూడా అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సీఈఓ వివరణ ఇచ్చారు.