మహిళా ఐఏఎస్‌పై మీడియాలో కథనం.. తీవ్రంగా స్పందించిన సజ్జనార్
- మహిళల ప్రతిష్ఠను దెబ్బతీయడాన్ని ఖండించాలన్న సజ్జనార్
- ఉద్దేశపూర్వకంగా దాడులు ఆందోళనకరమని వ్యాఖ్య
- వ్యక్తిత్వంపై దాడి అంటే పురోగతిపై దాడి చేసినట్లేనని వ్యాఖ్య
మహిళా అధికారులపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. ప్రజా జీవితంలో మహిళలను అవమానించడం క్రూరత్వమని, మహిళా ఉద్యోగులపై వ్యక్తిగత దూషణలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఒక వ్యక్తి వ్యక్తిత్వంపై దాడి చేయడం అంటే వారి పురోగతిని అడ్డుకోవడమేనని పేర్కొన్నారు. మహిళలను గౌరవించని సమాజం భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని హెచ్చరించారు. భవిష్యత్తు అంతా మహిళలదేనని గుర్తెరగాలని ఆయన సూచించారు.