Venkataiah Chowdary: తిరుమలలో క్యూఆర్ కోడ్ ఆధారిత పాదరక్షల కౌంటర్లు
- క్యూఆర్ కోడ్ ఆధారిత పాదరక్షల కౌంటర్లను ఏర్పాటు చేశామన్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి
- ఆధునిక సాంకేతికతతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని వెల్లడి
- ఈ కొత్త వ్యవస్థ ద్వారా దాదాపు 99 శాతం భక్తులు తమ పాదరక్షలను తిరిగి పొందగలుగుతున్నారన్న అదనపు ఈవో
తిరుమలలో భక్తులు ఎదుర్కొంటున్న పాదరక్షల నిర్వహణ సమస్యకు శాశ్వత పరిష్కారంగా లగేజీ కౌంటర్ల తరహాలో క్యూఆర్ కోడ్ ఆధారిత పాదరక్షల కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ కౌంటర్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ - 2 వద్ద పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ విధానం ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడంతో, ప్రస్తుతం తిరుమలలోని పలు ప్రాంతాల్లో మొత్తం ఎనిమిది క్యూఆర్ కోడ్ ఆధారిత కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఈ కొత్త వ్యవస్థ ద్వారా దాదాపు 99 శాతం భక్తులు తమ పాదరక్షలను తిరిగి పొందగలుగుతున్నారని, గతంలో పాదరక్షలు గుట్టలుగా పడిపోవడంతో 70 నుంచి 80 శాతం మంది భక్తులు అవి దొరకక వదిలేసి వెళ్లే పరిస్థితి ఉండేదని ఆయన వివరించారు.
సీఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ పూర్తిస్థాయిలో ఈ విధానాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరమండల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డా. కె.సత్యనారాయణతో పాటు టీటీడీ అధికారులు పాల్గొన్నారు.