Mary Kom: ఆమెకు అఫైర్లు ఉన్నాయి... మేరీకోమ్ పై మాజీ భర్త సంచలన ఆరోపణలు

Mary Kom Ex Husband Alleges Affairs
  • ఆర్థిక ఆరోపణలను తీవ్రంగా ఖండించిన మేరీ కోమ్ మాజీ భర్త
  • మేరీ కోమ్‌కు వివాహేతర సంబంధాలున్నాయని సంచలన ఆరోపణ
  • ఆమె ఎఫైర్లకు సంబంధించిన వాట్సాప్ మెసేజ్‌లు తన వద్ద ఉన్నాయన్న ఓన్లెర్
  • తాను ఢిల్లీలో అద్దె ఇంట్లో ఉంటున్నానని, కోట్లు కాజేశాననడం అబద్ధమని వెల్లడి
  • నన్ను వాడుకుని వదిలేసిందంటూ మీడియా ముందు ఓన్లెర్ ఆవేదన
ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్‌పై ఆమె మాజీ భర్త కరుంగ్ ఓన్‌ఖోలర్ (ఓన్లెర్) సంచలన ఆరోపణలు చేశారు. కోట్ల రూపాయల డబ్బు, భూమి విషయంలో తనను మోసం చేశారంటూ  మేరీ కోమ్ చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. అంతేకాదు, మేరీ కోమ్‌కు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, అందుకు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఆరోపించారు. ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.

"2013లో ఒక జూనియర్ బాక్సర్‌తో, 2017 నుంచి మేరీ కోమ్ బాక్సింగ్ అకాడమీలో పనిచేసే మరో వ్యక్తితో ఆమెకు సంబంధం ఉంది. వారి వాట్సాప్ మెసేజ్‌లు నా దగ్గర ఆధారాలుగా ఉన్నాయి. అయినా ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నాను," అని ఓన్లెర్ వివరించారు. మేరీ కోమ్ విడిగా ఉంటూ మరొకరితో సంబంధం పెట్టుకోవాలనుకుంటే తనకు అభ్యంతరం లేదని, కానీ తనపై నిరాధార ఆరోపణలు చేయవద్దని అన్నారు.

ఆర్థిక మోసం ఆరోపణలపై ఓన్లెర్ స్పందిస్తూ, "ఆమె నాపై రూ.5 కోట్లు దొంగిలించానని ఆరోపిస్తోంది. నా అకౌంట్ చెక్ చేసుకోండి. నేను ప్రస్తుతం ఢిల్లీలో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాను. ఆస్తులు నా పేరు మీద ఉంటే, అందుకు సంబంధించిన పత్రాలు ఆమె దగ్గరే ఉంటాయి కదా? వాటిని బయటపెట్టమనండి" అని సవాల్ విసిరారు.

తనను వాడుకుని వదిలేసిందని ఓన్లెర్ ఆవేదన వ్యక్తం చేశారు. "ఆమె అకాడమీకి బీజం వేసింది ఎవరు? రిజిస్టర్ చేయించింది ఎవరు? ఇప్పుడు నన్ను పక్కనపెట్టేశారు. పిల్లలు నా రక్తం పంచుకుపుట్టినవారు. ఆమె నన్ను తాగుబోతు అంటోంది. పార్టీలలో నేనూ తాగాను, ఆమె కూడా వోడ్కా, రమ్ తాగింది. గుట్కా కూడా తిన్నది. కానీ నేను ఎప్పుడూ ఈ విషయాలు బయటపెట్టలేదు" అని అన్నారు.

మేరీ కోమ్, ఓన్లెర్‌కు 2005లో వివాహం కాగా, వారికి నలుగురు పిల్లలు ఉన్నారు. వ్యక్తిగత విభేదాల కారణంగా 2023లో వారు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఈ వివాదం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది
Mary Kom
Mary Kom controversy
Mary Kom affairs
Karung Onkholer
boxing
Indian boxer
Mary Kom divorce
financial fraud
sports controversy
Manipur

More Telugu News