నారా లోకేశ్ కు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్

  • తన సాధనను ఇలా గుర్తించడం తనపై ఉన్న బాధ్యతను మరింత గుర్తు చేస్తోందన్న పవన్ కల్యాణ్
  • యువత శారీరక, మానసిక వికాసానికి మార్షల్ ఆర్ట్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచన
  • ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన నేటి యువతకు స్ఫూర్తి అన్న లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. అరుదైన ఘనత సాధించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వకంగా అభినందించిన నేపథ్యంలో ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు.

తన సాధనను ఇలా గుర్తించడం తనపై ఉన్న బాధ్యతను మరింత గుర్తు చేస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సాధన, క్రమశిక్షణ పట్ల గౌరవమే తన బలమని పేర్కొన్న పవన్ కల్యాణ్.. యువత శారీరక, మానసిక వికాసానికి మార్షల్ ఆర్ట్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.

అంతకు ముందు పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ.. పురాతన జపనీస్ కత్తిసాము కళ ‘కెంజుట్సు’లో అధికారికంగా ప్రవేశం పొందడం పవన్ కల్యాణ్ జిజ్ఞాసకు నిదర్శనమని లోకేశ్ పేర్కొన్నారు. సినీ రంగంలో పవర్ స్టార్‌గా ఎదిగి, రాజకీయాల్లో ప్రజాభిమానం సంపాదించిన పవన్ కల్యాణ్, సినిమాల్లోకి రాకముందే మార్షల్ ఆర్ట్స్‌లో నిష్ణాతుడని గుర్తు చేశారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన నేటి యువతకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు పవన్ కల్యాణ్ స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. 


More Telugu News