Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో!

Nara Lokesh Arrives in Naravaripalle for Sankranti Celebrations
  • ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి నారావారిపల్లె చేరుకున్న మంత్రి లోకేశ్
  • రంగంపేట వద్ద తండ్రీకొడుకులకు ఘనస్వాగతం పలికిన నేతలు, ప్రజలు
  • ఏటా స్వగ్రామంలో సంక్రాంతి వేడుకలు జరుపుకునే నారా, నందమూరి కుటుంబాలు
  • నాలుగు రోజుల పాటు బంధువులు, గ్రామస్థులతో గడపనున్న కుటుంబ సభ్యులు
  • పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సంక్రాంతి సంబరాల కోసం సొంతూరికి చేరుకున్నారు. తన తండ్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో కలిసి చంద్రగిరి మండలం నారావారిపల్లెకు చేరుకున్నారు. ప్రతి ఏటా నిర్వహించే సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు వారు సోమవారం ఇక్కడికి విచ్చేశారు. ఈ సందర్భంగా రంగంపేట వద్ద మంత్రి లోకేశ్‌కు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు.

తమను చూసేందుకు వచ్చిన ప్రతిఒక్కరినీ మంత్రి నారా లోకేశ్ ఆప్యాయంగా పలకరించారు. కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఫోటోలు దిగుతూ ఉత్సాహపరిచారు. ఏటా సంక్రాంతి పండుగను నారా, నందమూరి కుటుంబ సభ్యులు నారావారిపల్లెలోనే జరుపుకోవడం ఆనవాయతీగా వస్తోంది. ఈ సంబరాల్లో పాల్గొనేందుకు ఇరు కుటుంబాల సభ్యులు గ్రామానికి చేరుకున్నారు.

ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, వారి కుటుంబ సభ్యులు నాలుగు రోజుల పాటు నారావారిపల్లెలోనే బస చేస్తారు. బంధువులు, గ్రామస్థులతో కలిసి పండుగను జరుపుకుంటారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు సమాచారం.
Nara Lokesh
Nara Chandrababu Naidu
Naravaripalle
Sankranti celebrations
Andhra Pradesh politics
Telugu Desam Party
Chandragiri
AP Minister
Family visit
Festival celebrations

More Telugu News