శ్రీలంకలో వంతెన నిర్మించిన భారత సైన్యం.. థ్యాంక్స్ చెబుతూ బాలిక వీడియో
- దిత్వా తుపానుతో అతలాకుతలమైన శ్రీలంక
- ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో భారత్ సహాయం
- దెబ్బతిన్న రోడ్లు, వంతెనల మరమ్మతు
తుపాను కారణంగా సెంట్రల్ ప్రావిన్స్-ఉవా ప్రావిన్స్ మధ్య వంతెన కూలిపోయింది. దీంతో ఆ రెండు ప్రావిన్స్ ల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారత సైన్యం సహకారంతో స్థానిక అధికారులు అక్కడ బెయిలీ వంతెన నిర్మించారు. దీనిని ఆదివారం ప్రారంభించగా.. స్థానిక విద్యార్థిని ఒకరు భారత సైన్యానికి థ్యాంక్స్ చెబుతూ ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.