Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

Chandrababu Naidu Wishes Youth on Vivekananda Jayanti
  • స్వామి వివేకానంద ఆదర్శాల నుంచే జాతీయ యువజన దినోత్సవానికి ప్రేరణ లభిస్తుందన్న సీఎం చంద్రబాబు
  • స్వామి వివేకానంద జీవితం భారత యువతలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, సేవాభావాన్ని నింపిందన్న వ్యాఖ్య
  • సనాతన ధర్మం గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు, యువతకు ఆదర్శప్రాయుడన్న లోకేశ్  
ఈ రోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ యువతకు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారు ఎక్స్ వేదికగా సందేశాలు ఇచ్చారు. స్వామి వివేకానంద ఆదర్శాల నుంచే జాతీయ యువజన దినోత్సవానికి ప్రేరణ లభిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. స్వామి వివేకానంద జీవితం భారత యువతలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, సేవాభావాన్ని నింపిందని ఆయన తెలిపారు.

యువతపై అపార విశ్వాసం ఉంచిన స్వామి వివేకానంద వ్యక్తిత్వ నిర్మాణం, జ్ఞానార్జన, క్రమశిక్షణ, ఐక్యతతో దేశం, మానవాళి కోసం స్వార్థరహితంగా పనిచేయాలని పిలుపునిచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. దేశానికి యువతే అతి పెద్ద బలమని పేర్కొంటూ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

సనాతన ధర్మం గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు, యువతకు ఆదర్శప్రాయుడు స్వామి వివేకానంద అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ, అందరికీ జాతీయ యువజన శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు.

తన ప్రసంగాలతో వివేకానందుడు నవతరానికి దిశానిర్దేశం చేశారని, ఆధునిక భారత నిర్మాణం కోసం పరితపించారని పేర్కొన్నారు. లక్ష్యసాధనలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా గమ్యం చేరే వరకు విశ్రమించవద్దని పిలుపునిచ్చారన్నారు. వివేకానంద స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణానికి కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. 
Chandrababu Naidu
Swami Vivekananda
Vivekananda Jayanti
Nara Lokesh
National Youth Day
AP CM
Youth Empowerment
Indian Youth
Sanatana Dharma
Modern India

More Telugu News