Nara Lokesh: సాయినాథుని సన్నిధిలో మంత్రి నారా లోకేశ్ దంపతులు

Nara Lokesh Visits Shirdi Temple with Wife
     
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సతీసమేతంగా సోమవారం ఉదయం మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీని సందర్శించారు. ఈ ఉదయం సూర్యోదయానికి ముందు సాయిబాబా సన్నిధిలో భక్తిశ్రద్ధలతో నిర్వహించే అత్యంత విశిష్టమైన ‘కాకడ హారతి’ కార్యక్రమంలో లోకేశ్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు, ఉన్నతాధికారులు సాదరంగా ఆహ్వానం పలికి, బాబా వారి శేషవస్త్రంతో ఘనంగా సత్కరించారు.

    
దర్శనం అనంతరం లోకేశ్ దంపతులు ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజా క్రతువు ముగిసిన తర్వాత అర్చకులు వారికి బాబా వారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఏపీలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలని కోరుకుంటూ మంత్రి ఈ పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది. లోకేశ్ వెంట పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కూడా ఉన్నారు. 
   
Nara Lokesh
Nara Lokesh Shirdi
Shirdi Temple
Andhra Pradesh Minister
Nara Brahmani
Kakada Harati
Sai Baba Temple
AP Politics
Temple Visit

More Telugu News