ఆల్ ఫలా వర్సిటీ క్యాంపస్ ఆస్తుల జప్తు!
- ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు కేసులో నిందితుడుగా అల్ ఫలా వర్సిటీ చైర్మన్ జావెద్
- అక్రమ మార్గాల్లో వచ్చిన నిధులతోనే వర్సిటీ భవనాలు నిర్మించారని భావిస్తున్న ఈడీ
- పీఎంఎల్ఎ కింద చర్యలకు సిద్దమవుతున్న ఈడీ
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు కేసులో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. అల్ ఫలా యూనివర్సిటీకి చెందిన ఆస్తులను జప్తు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధమైంది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు కేసుతో సంబంధం ఉన్న వ్యవహారంలో అల్ ఫలా విద్యా సంస్థల ఛైర్మన్ జావెద్ అహ్మద్ సిద్దిఖీని గత నవంబరులో ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉన్న ఈ యూనివర్సిటీ భవనాలు అక్రమ మార్గాల్లో వచ్చిన నిధులతోనే నిర్మించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద చర్యలు తీసుకునేందుకు ఈడీ రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అల్ ఫలా ట్రస్ట్కు చెందిన స్థిర, చరాస్తుల విలువలను అంచనా వేసే ప్రక్రియ చేపట్టినట్లు సమాచారం. ఈ మదింపు పూర్తయిన వెంటనే యూనివర్సిటీ ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.