షిరిడీలో మంత్రి నారా లోకేశ్ కు ఘనస్వాగతం... ఫొటోలు ఇవిగో!

  • సతీసమేతంగా షిరిడీకి చేరుకున్న మంత్రి నారా లోకేశ్
  • సోమవారం ఉదయం కాకడ హారతిలో పాల్గొననున్న లోకేశ్ దంపతులు
  • మంత్రికి ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు
  • లోకేశ్ వెంట చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్, తన అర్ధాంగి బ్రహ్మణితో కలిసి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం షిరిడీ చేరుకున్నారు. షిరిడీ సాయినాథుని దర్శించుకునేందుకు వచ్చిన లోకేశ్ దంపతులకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

సోమవారం ఉదయం జరిగే కాకడ హారతి సేవలో లోకేశ్, బ్రహ్మణి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. షిరిడీ విమానాశ్రయంలో మంత్రికి కోపర్‌గావ్ ఎమ్మెల్యే, సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ మాజీ ఛైర్మన్ అశుతోష్ ఆకాశరావు కాలే, ఇతర అధికారులు సాదరంగా స్వాగతం పలికారు.
ఈ పర్యటనలో మంత్రి లోకేశ్ వెంట చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా ఉన్నారు. 




More Telugu News