పవనన్న తపన అద్భుతం: మంత్రి నారా లోకేశ్

  • డిప్యూటీ సీఎం పవన్‌కు మంత్రి లోకేశ్ అభినందనలు
  • జపనీస్ కత్తిసాము 'కెంజుట్సు'లో పవన్ అధికారిక ప్రవేశం
  • ఎంత ఎదిగినా నేర్చుకోవాలనే పవన్ తపన స్ఫూర్తిదాయకమన్న లోకేశ్
  • పవన్ కల్యాణ్ నేటి తరానికి ఆదర్శమని కొనియాడిన మంత్రి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అరుదైన ఘనత సాధించడంపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు. పురాతన జపనీస్ కత్తిసాము కళ 'కెంజుట్సు'లో పవన్ అధికారికంగా ప్రవేశం పొందారని, ఈ సందర్భంగా ఆయనకు మనఃపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని లోకేశ్ పేర్కొన్నారు.

ఈ మేరకు లోకేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు. "పురాతన జపనీస్ కత్తిసాము కళ 'కెంజుట్సు'లో అధికారికంగా ప్రవేశం పొందిన పవనన్న జిజ్ఞాస అద్భుతం. తెలుగు వారి అభిమాన కథానాయకుడై సినీ రంగంలో బహుముఖ ప్రతిభతో పవర్ స్టార్ గా ఎదిగారు. రాజకీయాల్లో ప్రజాభిమానం సంపాదించారు. సినిమాల్లో ప్రవేశించక ముందే మార్షల్ ఆర్ట్స్‌లో నిష్ణాతులయ్యారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, ఎంత విజ్ఞానం సంపాదించినా ఇంకా కొత్త అంశాలు నేర్చుకోవాలనే పవనన్న తపన నేటి తరానికి స్ఫూర్తి" అని కొనియాడారు. 


More Telugu News