Sukumar: డైరెక్టర్ సుకుమార్ బర్త్ డే.. అల్లు అర్జున్ ఆసక్తికర ట్వీట్
- ‘నువ్వు పుట్టినందుకు థ్యాంక్స్ డార్లింగ్’ అంటూ పోస్టు
- నా జీవితాన్నే మార్చేసిన రోజు ఇది..
- ఈ రోజు నీకంటే నాకు ఇంకా ప్రత్యేకమన్న బన్నీ
ప్రముఖ దర్శకుడు సుకుమార్ పుట్టిన రోజు సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర ట్వీట్ చేశారు. సుకుమార్ తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. సుకుమార్ పుట్టిన రోజు ఆయనకంటే తనకే ఎక్కువ ప్రత్యేకమైనదని బన్నీ చెప్పుకొచ్చారు. ‘హ్యాపీ బర్త్‌డే డార్లింగ్.. ఈ రోజు నీకంటే నాకే ఎక్కువ ప్రత్యేకం.. నా జీవితాన్ని మార్చేసిన రోజు ఇది. నా జీవితంలో నువ్వున్న ఆనందాన్ని ఏ మాటలూ పూర్తిగా చెప్పలేవు. పుట్టినందుకు థ్యాంక్స్’.. అంటూ ట్వీట్ చేశారు.
డైరెక్టర్ సుకుమార్పై అల్లు అర్జున్ ఎన్నోసార్లు తన ప్రేమని వ్యక్తపరిచి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. పుష్ప 2 గ్రాండ్ సక్సెస్ మీట్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. సుకుమార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సుకుమార్ నాకు ఓ పర్సన్ కాదు.. ఎమోషన్. తనకు నేను బిగ్గెస్ట్ ఫ్యాన్‌ను. తను ఓ జీనియస్’ అంటూ ప్రశంసలు కురిపించారు.