మన శంకరవరప్రసాద్ గారి హవా.. నిమిషాల్లోనే హౌస్‌ఫుల్!

Mana Shankara Varaprasad Garu Starring Chiranjeevi Opens with Huge Response
సంక్రాంతి పండుగ సందడిని ఒక్కరోజు ముందే తీసుకొస్తూ, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్‌ నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా హవా మొదలైంది. రేపు (జనవరి 12) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఈరోజు ప్రారంభం కాగా, అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. బుకింగ్స్ తెరిచిన నిమిషాల్లోనే హైదరాబాద్, వైజాగ్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లోని థియేటర్లలో ‘హౌస్‌ఫుల్’ బోర్డులు దర్శనమిచ్చాయి.

ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో అభిమానుల కోరిక మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పెషల్ ప్రీమియర్ షోలకు అనుమతినిచ్చాయి. నేటి రాత్రి 8 గంటల నుంచే ఈ ప్రత్యేక ప్రదర్శనలు ప్రారంభం కానున్నాయి.

ఈ స్పెషల్ ప్రీమియర్ షోల కోసం టికెట్ ధరలను కూడా ఖరారు చేశారు. తెలంగాణలో టికెట్ ధర రూ.600గా నిర్ణయించగా, ఆంధ్రప్రదేశ్‌లో రూ.500గా అందుబాటులో ఉంచారు. భారీ తారాగణం, పండుగ సీజన్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Go Back to Shorts
Mana Shankara Varaprasad Garu
Chiranjeevi
Venkatesh
Anil Ravipudi
Sankranthi
Telugu Movie
Hyderabad
Vizag
Vijayawada
Special Premier Shows

More Telugu News