Rahul Mamkootathil: అత్యాచారం కేసులో ఎమ్మెల్యే అరెస్ట్.. కేరళలో ఘటన

Kerala MLA Rahul Mamkootathil Arrested After Rape Allegations
  • రెండు కేసుల్లో బెయిల్ తెచ్చుకున్న ఎమ్మెల్యే
  • మూడో అత్యాచారం కేసులో అర్ధరాత్రి అదుపులోకి..
  • గతంలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ
కేరళకు చెందిన కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే రాహుల్ మామ్ కూటతిల్ ను పోలీసులు శనివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఆయనపై నమోదైన మూడో అత్యాచార ఫిర్యాదు కేసులో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. గతంలో నమోదైన అత్యాచార కేసుల్లో కేరళ హైకోర్టు నుంచి, మరో కేసులో ట్రయల్ కోర్టు నుంచి రాహుల్ ముందస్తు బెయిల్ పొందారు. ఈ అత్యాచార ఆరోపణలు, కేసుల నేపథ్యంలో రాహుల్ ను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది.

అయితే, తాజాగా ఆయనపై మరో అత్యాచార కేసు నమోదైంది. సీఎంవో ఆఫీసుకు మెయిల్ ద్వారా రాహుల్ పై ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును సీఎంవో క్రైమ్ బ్రాంచ్ కు పంపగా.. విచారణ నిమిత్తం ఎమ్మెల్యేను అరెస్టు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈమెయిల్ లో బాధితురాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే రాహుల్ తనపై అత్యాచారం చేశాడని, తన అభీష్టానికి వ్యతిరేకంగా అబార్షన్ చేయించాడని ఆరోపించింది.

శారీరకంగా, మానసికంగా వేధింపులకు పాల్పడ్డాడని తెలిపింది. తనను ఆర్థికంగా కూడా మోసం చేశాడని ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసింది. ఈ ఫిర్యాదుతో ఎమ్మెల్యే రాహుల్ మామ్ కూటతిల్ ను పథనంతిట్టలో అదుపులోకి తీసుకున్నట్లు క్రైంబ్రాంచ్ పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణ తర్వాత తిరువల్ల కోర్టులో రాహుల్ ను ప్రవేశపెట్టి కస్టడీ కోరనున్నట్లు వెల్లడించారు.
Rahul Mamkootathil
Kerala
MLA Arrest
Rape Case
Congress
Sexual Assault
Crime Branch
Thiruvalla Court
Abortion

More Telugu News