నదీగర్భం అంటూ జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు: నారాయణ

  • ప్రపంచంలో ఎన్నో నగరాలు నదుల ఒడ్డునే ఉన్నాయన్న నారాయణ
  • హైదరాబాద్, అమరావతి సచివాలయాలను పోల్చడం సరికాదని వ్యాఖ్య
  • అమరావతి ఐకానిక్ టవర్లు చాలా విశాలంగా ఉంటాయన్న మంత్రి
ఏపీ రాజధాని అమరావతిని నదీగర్భంలో నిర్మిస్తున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారాయణ విమర్శలు గుప్పించారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన నగరాలెన్నో నదుల ఒడ్డునే ఉన్నాయని... నదీగర్భంలో అమరావతి అంటూ అవగాహన లేకుండా జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

ఇక, సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయాన్ని హైదరాబాద్ లోని సెక్రటేరియట్ తో పోల్చి చూడటం సరికాదని అన్నారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి, మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, వారి సిబ్బంది అంతా ఒకే చోట ఉంటారని... అందుకే అమరావతిలో సెక్రటేరియట్ ఐకానిక్ టవర్లు చాలా విశాలంగా ఉంటాయని చెప్పారు. ఎంతో దూరదృష్టితో అమరావతి నిర్మాణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టారని కొనియాడారు.


More Telugu News