Maruthi: ప్రభాస్ ను కొత్తగా చూపించాలనేదే నా ఉద్దేశం: దర్శకుడు మారుతి

Rajasaab Blockbuster Meet
  • నిన్న విడుదలైన 'రాజాసాబ్'
  • అసహనాన్ని వ్యక్తం చేసిన ఫ్యాన్స్ 
  • ప్రభాస్ ఓల్డ్ గెటప్ ఎపిసోడ్ విషయంలో అసంతృప్తి 
  • నిడివి పెంచామన్న మారుతి
  • రిజల్ట్ అప్పుడే డిసైడ్ చేయొద్దని మనవి
       
ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు మారుతి 'రాజా సాబ్' సినిమాను తెరకెక్కించారు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, నిన్ననే థియేటర్లకు వచ్చింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా, థియేటర్ల దగ్గర గట్టిగానే సందడి చేస్తోంది. అదే సమయంలో దర్శకుడు మారుతిపై విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయిందనే టాక్ బలంగా షికారు చేస్తోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన బ్లాక్ బస్టర్ మీట్ లో మారుతి మాట్లాడారు. 

" 9 నెలలకి ఒక సినిమా తీసే నేను .. ఈ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాను. ప్రభాస్ కి నచ్చేలా .. ఆయనను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించడానికి ప్రయత్నిస్తూ ముందుకు వెళ్లాను. ప్రభాస్ ను సాధ్యమైనంత కొత్తగా చూపించాలనే ఉద్దేశంతోనే ఆయన పాత్రను డిజైన్ చేసుకోవడం జరిగింది. ప్రభాస్ తో నేను కూడా ఒక కమర్షియల్ సినిమా చేయవచ్చు .. ఈజీగా అయిపోతుంది కూడా. కానీ ఇలాంటి ఒక సినిమా చేయాలనే సంకల్పం ప్రభాస్ కి కూడా ఉండటం వలన చేయడం జరిగింది" అని అన్నారు. 

"ఈ సినిమాలో కొత్త పాయింట్ ను చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే కొత్త పాయింట్ ఎక్కడానికి కొంత సమయం పడుతుంది. ఓ పది రోజులు పోతేగానీ ఈ సినిమా గురించిన రిజల్ట్ తెలియదు. ఈ లోగా తొందరపడి ఒక రోజులో .. ఒక షోతో సినిమా ఏమిటనేది డిసైడ్ చేయడం కరెక్టు కాదు. నేను చేసిన ప్రయత్నం కామన్ ఆడియన్స్ కి రీచ్ అయిందనే అనుకుంటున్నాను. క్లైమాక్స్ ఎపిసోడ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

ప్రభాస్ ఓల్డ్ గెటప్ తెరపై ఎక్కువ సేపు కనిపించకపోవడం వలన, అభిమానులు అసంతృప్తికి లోనయ్యారనే విషయం మాకు అర్థమైంది. దాంతో ఉన్న కంటెంట్ ను కాస్త ట్రిమ్ చేసి, ప్రభాస్ ఓల్డ్ గెటప్ కి సంబంధించిన నిడివిని పెంచాము. ఈ రోజు సాయంత్రం 6 గంటల షో నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుంది. ఈ ఎపిసోడ్ తప్పకుండా మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. ఏదేమైనా నాలాంటి మిడ్ రేంజ్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను" అని చెప్పారు. 

Maruthi
Prabhas
Raja Saab
Telugu cinema
Tollywood
Director Maruthi
Telugu movies
Sankranti release
Commercial cinema
Movie review

More Telugu News