Allu Arjun: నాన్నే నా దేవుడు.. తండ్రిపై ప్రేమను చాటుకున్న అల్లు అర్జున్

Allu Arjun Shares Heartfelt Birthday Wish for Father Allu Aravind
  • తండ్రి అల్లు అరవింద్‌ 77వ పుట్టినరోజున బ‌న్నీ ప్రత్యేక శుభాకాంక్షలు
  • నా జీవితంలో దేవుడికి దగ్గరైన వ్యక్తి నాన్నేనంటూ భావోద్వేగ పోస్ట్
  • ఇన్‌స్టాగ్రామ్‌లో తండ్రితో దిగిన ఫొటోను షేర్ చేసిన అల్లు అర్జున్‌
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 77వ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమారుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. తన జీవితంలో దేవుడికి అత్యంత దగ్గరైన వ్యక్తి తన తండ్రేనంటూ ఆయనపై ఉన్న ప్రేమను, గౌరవాన్ని చాటుకున్నారు.

ఈ మేరకు తన తండ్రితో కలిసి కొత్తగా ప్రారంభించిన అల్లు సినిమాస్ వద్ద దిగిన ఒక అందమైన ఫొటోను అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. "పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. నా జీవితంలో దేవుడికి అత్యంత దగ్గరైన వ్యక్తి మీరే. మీరు ఎల్లప్పుడూ ఆనందంగా జీవించాలి" అని తన పోస్టులో పేర్కొన్నారు.

గీతా ఆర్ట్స్ వ్యవస్థాపకుడిగా అల్లు అరవింద్ టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన నిర్మాతల్లో ఒక‌రిగా పేరుగాంచారు. ఆయన నిర్మించిన చిత్రాలలో ‘పసివాడి ప్రాణం’, ‘జల్సా’, ‘గజని’, ‘మగధీర’, ‘సరైనోడు’, ‘అల వైకుంఠపురములో’ వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్లు ఉన్నాయి.

ఇక అల్లు అర్జున్‌ కెరీర్ విషయానికొస్తే, ఆయన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప‌ 2: ది రూల్’ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆయన పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దర్శకుడు త్రివిక్రమ్‌తో కలిసి ఒక పౌరాణిక చిత్రంలో నటించనుండగా, ఇది 2027 ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దీంతో పాటు ‘పుష్ప‌3’ సుకుమార్ దర్శకత్వంలో రానుంది. అలాగే స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రంలో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. 
Allu Arjun
Allu Aravind
Allu Arjun father
Allu Cinemas
Geetha Arts
Pushpa 2 The Rule
Trivikram
Atlee
Telugu cinema
Tollywood

More Telugu News