చిరు సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ సర్కారు అనుమతి
- ప్రీమియర్ షో టికెట్ ధర రూ.600
- సింగిల్ స్క్రీన్ థియేటర్ లో రూ.50 పెంపు
- మల్టీప్లెక్స్ లలో టికెట్ ధరలు రూ.100 పెంచుకోవచ్చు
ప్రీమియర్ షోతో పాటు వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి టికెట్ ధరల పెంపునకు అనుమతినిచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధర రూ.600, సింగిల్ స్క్రీన్ థియేటర్ లో టికెట్ ధర రూ.50 పెంపు, మల్టీప్లెక్స్ లలో రూ.100 మేరకు పెంచుకోవచ్చని సూచించింది. పెంచిన రేట్లను వారం రోజుల పాటు వసూలు చేసుకోవచ్చని తెలిపింది.