Almont Kid Syrup: విషపూరితంగా మారిన కిడ్స్ సిరప్.. వాడొద్దంటూ తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ వార్నింగ్

Telangana Warns Against Almont Kid Syrup Due to Poisonous Contamination
  • అమ్మకాలపై నిషేధం విధించిన అధికారులు
  • రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్ ఇన్ స్పెక్టర్లకు సూచనలు
  • కల్తీ జరిగిన సిరప్ బ్యాచ్, తయారీ వివరాల వెల్లడి
పిల్లలకు వాడే సిరప్ కలుషితమై విషపూరితంగా మారిందని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఆల్మంట్ కిడ్ సిరప్ వాడొద్దని రాష్ట్రంలోని తల్లిదండ్రులకు సూచించారు. కలుషితమైన సిరప్ బ్యాచ్ వివరాలను వెల్లడిస్తూ.. ఆ సిరప్ బాటిల్ ఉంటే వెంటనే సమీపంలోని డ్రగ్స్ కంట్రోల్ అథారిటీకి తెలియజేయాలని కోరారు. ఈ మేరకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కోల్‌కతా నుంచి సమాచారం అందిందని పేర్కొన్నారు.

అత్యంత విషపూరితమైన ఇథిలీన్ గ్లైకాల్ ఈ ఆల్మంట్‌ కిడ్‌ సిరప్ లో కలిసిందని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు గుర్తించి ఈ మేరకు తెలంగాణ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో ఆల్మంట్ కిడ్ సిరప్ అమ్మకాలను నిషేధిస్తూ, ఇప్పటికే కొనుగోలు చేసిన తల్లిదండ్రులకు తెలంగాణ అధికారులు హెచ్చరికలు చేశారు. ఇందుకోసం టోల్-ఫ్రీ నంబర్ 1800-599-6969 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు, సహాయ సంచాలకులందరికీ, ఈ ఉత్పత్తి బ్యాచ్‌కు సంబంధించిన అందుబాటులో ఉన్న స్టాక్‌లను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇథిలీన్ గ్లైకాల్ విషపూరిత ప్రభావాల వల్ల కలిగే అనారోగ్యాలకు సంబంధించిన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని ఆసుపత్రులకు సూచనలు చేశారు.
 
కల్తీ అయిన సిరప్ వివరాలు..
అల్మాంట్-కిడ్ సిరప్ (లెవోసెటిరిజైన్ డైహైడ్రోక్లోరైడ్, మోంటెలుకాస్ట్ సోడియం సిరప్)
బ్యాచ్ నెం. AL-24002
తయారీ తేదీ జనవరి-2025
గడువు తేదీ డిసెంబర్-2026
Almont Kid Syrup
Telangana Drugs Control
Kids Syrup
Ethylene Glycol
Syrup Contamination
Drug Warning
Levocetirizine Dihydrochloride
Montelukast Sodium Syrup
AL-24002
Poisonous Syrup

More Telugu News