అభిమానుల తాకిడి.. అమితాబ్‌కు తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్!
- సూరత్ ఎయిర్‌పోర్ట్‌లో అమితాబ్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్
- అభిమానుల తాకిడికి పగిలిపోయిన ఎయిర్పోర్ట్ గ్లాస్ డోర్
- త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడిన బిగ్ బీ
ఈ క్రమంలో ఏర్పడిన తోపులాటలో విమానాశ్రయం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. అయితే, ఆ సమయంలో అమితాబ్ కాస్త దూరంగా ఉండటంతో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అభిమానుల అత్యుత్సాహం కారణంగా చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.