ప్రమీల: ఖమ్మంలో మహిళ దారుణ హత్య

Pramila Murdered Brutally in Khammam
  • ఖమ్మం కస్బాబజారులో ఘటన 
  • హతురాలు భద్రాచలానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడి భార్య ప్రమీలగా గుర్తింపు
  • భర్త స్నేహితుడు శ్రావణ్ వేధింపులకు గురి చేస్తున్నాడని గతంలో పోలీసులకు ఫిర్యాదు 
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఖమ్మం నగరంలో గత రాత్రి ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కస్బాబజార్‌లోని ఓ మాల్‌ పక్క సందులో సుమారు 35 ఏళ్ల వయసున్న మహిళ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
 
సమాచారం అందుకున్న ఖమ్మం ఒకటో పట్టణ ఎస్ఐ మౌలానా ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హతురాలు భద్రాచలానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడి భార్య ప్రమీలగా గుర్తించారు.
 
పిల్లలు లేకపోవడంతో గత కొన్నేళ్లుగా భార్యాభర్తలు వేర్వేరుగా జీవిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ప్రమీలను భర్త స్నేహితుడు శ్రావణ్‌ కొన్ని నెలలుగా వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నెల క్రితం భద్రాచలంలో శ్రావణ్‌పై ప్రమీల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
 
తనకు సహకరించకపోవడమే కాకుండా తనపై కేసు పెట్టిందన్న కోపంతో శ్రావణ్‌ ఈ ఘతకానికి పాల్పడి ఉండవచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
ప్రమీల
ప్రమీల murder
Khammam crime
Khammam news
Bhadrachalam
Sravan
murder investigation
crime news telugu
telangana crime news

More Telugu News