Weather Update: తుపానుగా బలపడని తీవ్ర వాయుగుండం

India Meteorological Department Forecasts Rain in Andhra Pradesh Due to Depression
  • వాతావరణ పరిస్థితులు అనుకూలించక నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతున్న వైనం
  • ఈ రోజు మధ్యాహ్నానికి శ్రీలంకలోని ట్రింకోమలి - జాఫ్నా మధ్య ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందన్న ఐఎండీ 
  • నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న విపత్తుల నిర్వహణ సంస్థ
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది శుక్రవారం నాటికి తుపానుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తొలుత అంచనా వేసింది. అయితే, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో తుపానుగా మారలేదని వాతావరణ నిపుణులు తెలిపారు.

ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం వాయవ్య దిశగా కదులుతూ, ఈ రోజు మధ్యాహ్నానికి శ్రీలంకలోని ట్రింకోమలి - జాఫ్నా మధ్య ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది.

దీని ప్రభావంతో ఈరోజు, రేపు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షం పడవచ్చని పేర్కొంది.

మరోవైపు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని కొన్నిచోట్ల ఈ రోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. 
Weather Update
IMD
India Meteorological Department
Cyclone
Bay of Bengal
Andhra Pradesh Rains
Tamil Nadu Rains
Kerala Rains
Sri Lanka
Weather Forecast

More Telugu News