Telangana Cyber Security: చైల్డ్ పోర్న్... 24 మందిని అరెస్టు చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్
- చైల్డ్ పోర్న్ చూస్తూ, అప్లోడ్ చేస్తున్న వారిని అరెస్టు చేసిన సైబర్ సెక్యూరిటీ పోలీసులు
- అరెస్టైన వారిలో ఎక్కువ మంది 18 నుంచి 48 ఏళ్ల వయస్సువారు
- నిందితులకు దేశవ్యాప్తంగా 37 సైబర్ క్రైమ్ కేసులతో సంబంధం ఉన్నట్లు గుర్తింపు
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు చైల్డ్ పోర్న్ చూస్తూ, అప్లోడ్ చేస్తున్న 24 మందిని అరెస్టు చేశారు. చైల్డ్ పోర్న్పై సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ఈరోజు భారీ ఆపరేషన్ చేపట్టారు. చైల్డ్ పోర్న్ నిందితుల్లో నీటి పారుదల శాఖ అధికారి కూడా ఉన్నట్లు సమాచారం.
అరెస్టైన 24 మందిలో ఎక్కువ మంది 18 నుంచి 48 ఏళ్ల వయస్సు కలిగిన వారుగా గుర్తించారు. నిందితులకు దేశవ్యాప్తంగా 37 సైబర్ క్రైమ్ కేసులతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. నిందితుల్లో పది మందికి మ్యూల్ ఖాతాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ మ్యూల్ ఖాతాలా ద్వారా రూ.26 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. నేరస్థులు అక్రమంగా సంపాదించిన తమ డబ్బును చట్టబద్ధమైన మార్గంలోకి మార్చడానికి ఉపయోగించే బ్యాంకు ఖాతాను మ్యూల్ ఖాతా అంటారు. కమిషన్ ఇస్తామని చెప్పి కొంతమంది ఖాతాలను నేరస్తులు ఉపయోగించుకుంటారు.