Avika Gor: ప్రెగ్నెన్సీ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ అవికా గోర్
- 'కొత్త ప్రారంభం' అనే క్యాప్షన్‌తో ఇటీవల పోస్ట్ పెట్టిన అవికా గోర్
- తల్లి కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు
- ఈ ప్రచారంలో నిజం లేదన్న అవికా గోర్
ఇటీవల అవికా గోర్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక చిన్న పోస్ట్ పెద్ద చర్చకు దారి తీసింది. 'కొత్త ప్రారంభం' అనే క్యాప్షన్‌తో ఆమె షేర్ చేసిన పోస్ట్‌ను చూసి, అవికా తల్లి కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. కొందరు అభిమానులు శుభాకాంక్షలు చెప్పడం మొదలుపెట్టగా, మరికొందరు ఇది ఒక హింట్ అని భావించారు. అయితే ఈ ప్రచారంపై తాజాగా అవికా స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు.
తన గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అవికా గోర్ ఖండించారు. తాను తల్లి కాబోతున్నానన్న ప్రచారం పూర్తిగా రూమర్స్ మాత్రమేనని చెప్పారు. అసత్యమైన విషయాలను ఎందుకు ఇంత వేగంగా షేర్ చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న మాట లేదా పోస్ట్ చూసి అభిమానులు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారని అన్నారు. ఇలాంటి వార్తలు తనను అసౌకర్యానికి గురిచేస్తున్నాయని కూడా తెలిపారు.
అయితే, అదే సమయంలో ఒక విషయం మాత్రం ఆసక్తికరంగా మారింది. నిజంగానే తన జీవితంలో ఒక పెద్ద శుభవార్త ఉందని అవికా చెప్పారు. కానీ అది ఏంటన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేనని, సరైన సమయంలో అధికారికంగా వెల్లడిస్తానని తెలిపారు. దీంతో నెటిజన్లు ఇది ఆమె కొత్త సినిమా లేదా కెరీర్‌కు సంబంధించిన అప్‌డేట్ అయి ఉండొచ్చని ఊహిస్తున్నారు.
తెలుగు ప్రేక్షకులకు అవికా గోర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె, తొలి ప్రయత్నంలోనే మంచి విజయం అందుకున్నారు. ఆ తర్వాత ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజుగారి గది 3’ వంటి సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. టీవీ సీరియల్స్ నుంచి సినిమాల వరకు తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించారు.
వ్యక్తిగత జీవితానికి వస్తే, గతేడాది సెప్టెంబర్ 30న తన ప్రియుడు మిలింద్ చద్వానీని అవికా వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి తన వ్యక్తిగత జీవితం కూడా తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు “కొత్త ప్రారంభం” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఆసక్తి పెరిగింది. అవికా చెప్పిన ఆ శుభవార్త ఏంటన్నది తెలుసుకోవాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.