KCR: కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మంత్రులు కొండా సురేఖ, సీతక్క.. బీఆర్ఎస్ అధినేత ఆత్మీయ పలకరింపు

KCR Greets Ministers Konda Surekha and Seethakka at Farmhouse
  • మేడారం జాతరకు ఆహ్వానం పలికేందుకు ఎర్రవెల్లికి చేరుకున్న మంత్రులు
  • "బాగున్నారా అమ్మా" అని పలకరించిన కేసీఆర్
  • మంత్రులకు అతిథి మర్యాదలతో పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో కేసీఆర్ సత్కారం
తెలంగాణ రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్కలను మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయంగా పలకరించారు. తన నివాసానికి వచ్చిన మంత్రులను "బాగున్నారా అమ్మా" అని ఆయన అప్యాయంగా పలకరించారు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఆహ్వాన పత్రికను కేసీఆర్‌కు అందజేసేందుకు మంత్రులు ఎర్రవెల్లిలోని ఆయన ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. వారిని ఆయన మర్యాద పూర్వకంగా పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కరించారు.

మంత్రులు కేసీఆర్‌కు ఆహ్వాన పత్రికను, ప్రసాదంను అందజేసి, మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న జాతరకు రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానించారు. కేసీఆర్ దంపతులు ఇచ్చిన తేనీటి విందును మంత్రులు స్వీకరించారు. అనంతరం వారు కేసీఆర్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వద్ద మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ స్వాగతం పలికారు.
KCR
KCR farm house
Konda Surekha
Seethakka
BRS
Medaram Sammakka Saralamma Jathara

More Telugu News