తిలక్ వర్మ త్వరగా కోలుకోవాలి: మంత్రి నారా లోకేశ్
- టీమిండియా బ్యాటర్ తిలక్ వర్మకు అత్యవసర శస్త్రచికిత్స
- త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మంత్రి నారా లోకేశ్
- న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు తిలక్ వర్మ దూరం
- ప్రపంచకప్‌లోనూ ఆడటంపైనా నెలకొన్న సందేహాలు
టీమిండియా యువ క్రికెటర్, తెలుగు తేజం తిలక్ వర్మ త్వరగా కోలుకోవాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు. తిలక్ వర్మకు అత్యవసర శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో లోకేశ్ స్పందించారు. "తిలక్ వర్మ త్వరగా, సంపూర్ణంగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. కఠిన సమయాలే నిజమైన ఛాంపియన్లను పరీక్షిస్తాయి. నువ్వు మునుపటి కంటే మరింత బలంగా తిరిగి వస్తావన్న నమ్మకం నాకుంది" అని లోకేశ్ పేర్కొన్నారు.
విజయ్ హజారే ట్రోఫీ కోసం రాజ్‌కోట్‌లో ఉన్న తిలక్ వర్మకు బుధవారం ఉదయం తీవ్రమైన కడుపునొప్పి రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్ అనంతరం వైద్యులు అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) వైద్య బృందంతో సంప్రదింపులు జరిపిన తర్వాత శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.
ఈ శస్త్రచికిత్స కారణంగా తిలక్ వర్మ, న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు పూర్తిగా దూరం కానున్నాడు. అంతేకాకుండా, ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లోనూ అతను ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ పరిణామం క్రీడాభిమానులను ఆందోళనకు గురిచేసింది.