Azizur Rahman Musabbir: బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీకి చెందిన రాజకీయ నాయకుడిని కాల్చి చంపిన దుండగులు

BNP Leader Azizur Rahman Musabbir Shot Dead in Bangladesh
  • బీఎన్‌పీ స్వచ్ఛంద విభాగం స్వేచ్ఛా సేబక్ దళ్ నాయకుడు అజీజుర్ హత్య
  • ఢాకాలోని ఒక హోటల్ సమీపంలో కాల్పుల ఘటన
  • కాల్పుల్లో మరో వ్యక్తికి గాయాలు, ఆసుపత్రిలో చికిత్స
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) స్వచ్ఛంద విభాగం స్వచ్ఛసేవక్ దళ్ నాయకుడు అజీజుర్ రెహమాన్ ముసాబ్బీర్‌ను బుధవారం రాత్రి ఢాకాలో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనలో మరొక వ్యక్తి గాయపడ్డారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అజీజుర్ గతంలో బీఎన్‌పీకి చెందిన ఢాకా మెట్రోపాలిటన్ నార్త్ స్వచ్ఛ సేవక్ దళ్‌కు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఢాకాలోని కర్వాన్ బజార్ వద్ద ఒక హోటల్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. దుండగులు అతి దగ్గరి నుంచి అజీజుర్‌పై కాల్పులు జరిపి పరారయ్యారు. బాధితుడు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ఈ ఘటనలో గాయపడిన మరొక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, అజీజుర్‌పై కాల్పులను నిరసిస్తూ బీఎన్‌పీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
Azizur Rahman Musabbir
Bangladesh Nationalist Party
BNP
Dhaka
Bangladesh election
political violence

More Telugu News