అన్వేష్‌ను భరతమాత కాళ్ల దగ్గరకు తీసుకొస్తానన్న ఉక్రెయిన్ మహిళ

  • హిందూ దేవతల పట్ల అన్వేష్ అసభ్యకర మాటలు
  • అన్వేవ్ వ్యాఖ్యలపై ఉక్రెయిన్ మహిళ లిడియా లక్ష్మి ఆగ్రహం
  • ఆంధ్ర అబ్బాయి వెంకట్‌ను పెళ్లి చేసుకున్న లిడియా

ప్రపంచ పర్యాటకుడిగా పేరు తెచ్చుకున్న అన్వేష్, అనేక దేశాలు తిరిగి యూట్యూబ్‌లో భారీ ఫాలోవర్స్ సంపాదించాడు. కానీ ఇటీవల అతని వికృత చేష్టలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ముఖ్యంగా హిందూ దేవతలు, మహిళల పట్ల అసభ్యకర మాటలు అతడిని వివాదాస్పదంగా మార్చాయి. నెటిజన్లు, సినీ ప్రముఖులు అతని తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా ఉక్రెయిన్‌కు చెందిన లిడియా లక్ష్మి అనే మహిళ కూడా అన్వేష్‌పై మండిపడ్డారు. భారతీయ సనాతన ధర్మానికి ఫిదా అయి ఆంధ్ర అబ్బాయి తుమ్మపాల వెంకట్‌ను పెళ్లి చేసుకున్న లక్ష్మి, భారత సంస్కృతిని అధ్యయనం చేశారు.


థాయ్‌లాండ్ లోని ఉక్రెయిన్ ఎంబసీలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న లక్ష్మి... భారతీయ సంప్రదాయాలపై అన్వేష్ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. నాకు పర్మిషన్ ఇవ్వండి, అన్వేష్‌ను భరతమాత కాళ్ల దగ్గరకు తీసుకొస్తానని ఆమె స్పష్టం చేశారు. అతడు మరో దేశానికి పారిపోయే అవకాశాలున్నాయని చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


మరోవైపు అన్వేష్ కేసులో పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలు ఆ వివాదాస్పద వీడియోలు అన్వేష్ పోస్ట్ చేశాడా లేదా అని నిర్ధారించేందుకు ఇన్‌స్టాగ్రామ్‌కు లేఖ రాశారు. యూజర్ ఐడీ, యూఆర్‌ఎల్ వివరాలు అందజేయాలని కోరారు.



More Telugu News