Sivaji: శివాజీ విషయంలో పాజిటివ్ గా మాట్లాడిన అనసూయ!

Sivaji controversy Anasuyas new statement
  • శివాజీ ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో పైకి ఎదిగారన్న అనసూయ
  • ఇతరులు తన మాట వినేంత గౌరవం సంపాదించుకున్నారని వ్యాఖ్య
  • అబ్బాయిలకు కూడా బాధ్యతను గుర్తు చేసి ఉంటే ఈ వివాదమే ఉండేది కాదన్న అనసూయ

‘దండోరా’ సినిమా ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి సీనియర్ యాక్టర్ శివాజీ చేసిన వ్యాఖ్యలు భారీ వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే. హీరోయిన్లు పద్ధతిగా ఉండాలని, నిధి అగర్వాల్‌కు జరిగిన ఇన్సిడెంట్‌ను ఉదాహరణగా చూపిస్తూ ఆయన మాట్లాడటం అనేక మంది ఆడవాళ్లను కోపం తెప్పించింది. అనసూయ భరద్వాజ్, చిన్మయి శ్రీపాద లాంటి వారు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. తప్పు చేసే వాళ్లను వదిలేసి మాకు నీతులు చెబుతారా అంటూ అనసూయ ఫైర్ అవ్వడంతో ఈ గొడవ ‘శివాజీ వర్సెస్ అనసూయ’గా మారిపోయింది. నాగబాబు, ప్రకాష్ రాజ్ లాంటి వారు అనసూయకు మద్దతు పలికారు. సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయింది.


కానీ ఇప్పుడు సడెన్‌గా ట్విస్ట్ వచ్చింది. అనసూయ తన రూట్ మార్చి శివాజీ ఉద్దేశాన్ని పాజిటివ్‌గా అర్థం చేసుకుంటూ మాట్లాడారు. శివాజీ ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో ఈ స్థాయికి చేరుకున్నారని, ప్రజలు ఆయన మాట వినేంత గౌరవం సంపాదించారని అనసూయ పేర్కొన్నారు. ఆడపిల్లల భద్రత కోసం ఆయన పడిన ఆరాటం వెనుక మంచి ఉద్దేశమే ఉందని ఒప్పుకున్నారు. అయితే కేవలం అమ్మాయిలకు మాత్రమే కాకుండా అబ్బాయిలకు కూడా వాళ్ల బాధ్యతను గుర్తు చేసి ఉంటే ఈ వివాదమే రాదని సున్నితంగా సర్దిచెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనసూయ సున్నితమైన ఈ స్పందనతో కొద్ది రోజులుగా సాగుతున్న మాటల గొడవకు ఒక మంచి ముగింపు పడినట్లయింది.

Sivaji
Anasuya Bharadwaj
Dandora event
Nidhi Agarwal
dress code controversy
Telugu cinema
Tollywood
actress safety
social media
Chinmayi Sripada

More Telugu News