Pakistan: ప్రగల్భాలతో మరోసారి నవ్వులపాలవుతున్న పాక్!

Pakistan defense minister Khawaja Asif boasts about fighter jet demand
  • భారత్ తో యుద్ధం తర్వాత పాక్ మిలిటరీ సామర్థ్యానికి గుర్తింపు వచ్చిందట
  • తమ యుద్ధ విమానాలకు గిరాకీ పెరిగిందంటున్న పాక్ రక్షణ మంత్రి
  • రష్యా ఇంజన్, చైనా డిజైన్.. ఇదీ పాకిస్థాన్ యుద్ధ విమానాల తయారీ సామర్థ్యం
ప్రపంచ దేశాల ముందు ఎన్నిసార్లు నవ్వులపాలైనా సరే పాకిస్థాన్ పాలకులు తమ ప్రగల్భాలను మాత్రం విడిచిపెట్టరు. తినడానికి తిండి లేక జనం అలమటిస్తున్నా, ప్రపంచ ద్రవ్య నిధి దయతలచి అప్పు ఇస్తే కానీ పూటగడవని స్థితిలో ఉన్నా డబ్బా కొట్టుకోవడం మాత్రం మానరు. తాజాగా ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు ఈ కోవలోకే వస్తాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..

ఖవాజా ప్రగల్భాలు..
భారత్ తో ఇటీవల జరిగిన యుద్ధం తర్వాత పాకిస్థాన్ సైనిక సామర్థ్యం గురించి ప్రపంచానికి తెలిసిందని ఖవాజా ఆసిఫ్ చెప్పారు. తమ యుద్ధ విమానాల పాటవాన్ని గుర్తించి చాలా దేశాలు వాటిని సొంతం చేసుకోవాలని ముందుకొస్తున్నాయి. వాటికి ఎక్కడా లేని విధంగా డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్ ను చూస్తుంటే తాము ఇక అంతర్జాతీయ ద్రవ్య నిధి ఇచ్చే అప్పుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండకపోవచ్చని అన్నారు. 

ఇందులో నిజమెంత..
పాకిస్థాన్ ప్రస్తుతం అమ్ముతున్న యుద్ధ విమానాలు రెండు.. ఒకటి జేఎఫ్-17 కాగా రెండోది జే-10. వీటి కొనుగోలుకు ముందుకు వచ్చిన దేశాలు కూడా రెండే.. అందులో ఒకటి అజర్ బైజాన్, రెండోది లిబియా. వీటి అమ్మకానికి సంబంధించి బంగ్లాదేశ్ తో చర్చలు జరుగుతున్నాయి. ఈ రెండు యుద్ధ విమానాల తయారీలో పాకిస్థాన్ పాత్ర నామమాత్రమే. వాటి ఇంజన్లు రష్యా అందిస్తుండగా.. డిజైన్, తయారీ సంబంధిత పనులకు చైనాపై ఆధారపడుతోంది. ఒకటీ అరా పరికరాలు మాత్రమే పాకిస్థాన్ లో తయారవుతున్నాయి. అంటే.. పాక్ యుద్ధ విమానాల తయారీలో కీలక పాత్ర రష్యా, చైనాలదే. యుద్ధ విమానాల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తంలో పెద్ద మొత్తం ఆ రెండు దేశాలకే వెళుతుంది. ఇక మిగిలేదెంత.. ఆ మొత్తంతో ఐఎంఎఫ్ కు బాకీ పడిన 300 బిలియన్‌ డాలర్ల అప్పు ఎప్పటికీ తీరుతుందని నిపుణులు అంటున్నారు.

ఆర్థిక ఇబ్బందులు..
కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఐఎంఎఫ్‌ నిధులపైనే పాకిస్థాన్ ఆధారపడింది. నిధుల కోసం ఐఎంఎఫ్ విధించిన షరతులు పాటించడం మినహా గత్యంతరం లేకుండా పోయింది. ఇందులో భాగంగానే అంతర్జాతీయ విమానయాన సంస్థను అమ్మేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
Pakistan
Khawaja Asif
Pakistan military
Pakistan economy
JF 17
J 10 fighter
Azerbaijan
Libya
IMF loan
Pakistan defense

More Telugu News