Dementia: వయసేమో 24.. మెదడుకు మాత్రం 70 ఏళ్లు.. అతిపిన్న డిమెన్షియా బాధితుడి మృతి

Youngest Dementia Patient Andre Yerram Passes Away in UK
  • బ్రిటన్ యువకుడికి వృద్ధుల్లోనే ఎక్కువగా కనిపించే మతిమరుపు వ్యాధి
  • ఇన్ ఫెక్షన్ తో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి
  • బాధితుడి మెదడును పరిశోధనల కోసం ఇచ్చేసిన కుటుంబ సభ్యులు
వయసు పైబడిన తర్వాత చాలామంది మతిమరుపుతో బాధపడుతుంటారు. డిమెన్షియాగా వ్యవహరించే ఈ జబ్బు సాధారణంగా 45 సంవత్సరాలు పైబడిన వారిలోనే కనిపిస్తుంది. అంతకంటే తక్కువ వయస్కులు ఈ మతిమరుపు వ్యాధి బారిన పడటం అత్యంత అరుదు. ఇలాంటి అరుదైన కేసే బ్రిటన్ కు చెందిన అండ్రే యర్హామ్ ది. బ్రిటన్ లో డిమెన్షియాతో బాధపడుతున్న అత్యంత పిన్న వయస్కుడిగా అండ్రే వైద్య రికార్డులకెక్కారు. పాతికేళ్లు కూడా నిండకుండానే అండ్రే మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారు.

ఇటీవల ఇన్ ఫెక్షన్ తో ఆసుపత్రిలో చేరిన అండ్రే.. చికిత్స పొందుతూ చనిపోయాడు. అంతకు నెల రోజుల క్రితమే అండ్రేకు మాట పడిపోయింది. సైగలతోనే కుటుంబ సభ్యులతో సంభాషించేవాడని అండ్రే తల్లి వివరించారు. అండ్రే మెదడును పరిశోధనల కోసం కేంబ్రిడ్జిలోని ఆడెన్ బ్రూక్ ఆసుపత్రికి ఆమె డొనేట్ చేశారు. మరణించే సమయానికి అండ్రే వయసు 24 ఏళ్లు మాత్రమే.. కానీ ఆయన మెదడుకు మాత్రం 70 ఏళ్లు అని వైద్యులు తెలిపారు. 70 ఏళ్ల వృద్ధుడు ఎలా ప్రవర్తిస్తాడు.. ఏం చేస్తాడో అచ్చంగా అండ్రే కూడా అదేవిధంగా ప్రవర్తించేవాడని వివరించారు.

ప్రాణాంతక క్యాన్సర్ కు కూడా అంతోఇంతో చికిత్స ఉంది.. కీమోథెరపీ, రేడియోథెరపీ వంటి చికిత్సా విధానాలు ఉన్నాయి. కానీ మతిమరుపు వ్యాధి సోకిన వారికి మాత్రం ఇప్పటి వరకు నిర్దిష్టమైన చికిత్స లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు.
Dementia
Early Onset Dementia
UK Dementia
Memory Loss Disease
Andre Yerram
Adenbrooke Hospital
Cambridge
Medical Research
Rare Disease
Neurology

More Telugu News