ఏపీలో నిలిచిపోనున్న ఆర్టీసీ అద్దె బస్సులు.. సమ్మెకు యజమానుల పిలుపు

  • ఈ నెల 12 నుంచి బస్సులు నిలిపివేయాలని నిర్ణయం
  • అద్దె పెంచాలంటూ యజమానుల సంఘాల డిమాండ్
  • యాజమాన్యం ఇచ్చిన ఆఫర్‌పై తీవ్ర అసంతృప్తి
  • ఈరోజు ఆర్టీసీకి సమ్మె నోటీసు ఇవ్వనున్న సంఘాలు
ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె వాతావరణం నెలకొంది. అద్దె బస్సుల యజమానులు సమ్మె సైరన్ మోగించారు. తమకు చెల్లించే అద్దెను పెంచాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సులను నిలిపివేయనున్నట్లు హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

స్త్రీశక్తి పథకం అమలు తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిందని, దీనివల్ల తమపై అదనపు భారం పడుతోందని యజమానులు చెబుతున్నారు. మరోవైపు పెరిగిన ఇంధన, నిర్వహణ ఖర్చులతో నష్టాలు వస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో అద్దె పెంచడం తప్పనిసరి అని వారు వాదిస్తున్నారు.

ఈ విషయంపై ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. యాజమాన్యం నెలకు అదనంగా రూ. 5,200 ఇచ్చేందుకు ముందుకొచ్చినా, ఈ పెంపు చాలా స్వల్పమని యజమానుల సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. తమతో చర్చించి అద్దెను మరింత పెంచాలని కోరుతూ సమ్మెకు దిగుతున్నట్లు స్పష్టం చేశాయి.




More Telugu News