Nicolas Maduro: వెనెజువెలా అధ్యక్షుడు మదురో, ఆయన భార్యను అమెరికా ఎలా నిర్బంధించిందంటే?: ఏఐ వీడియో

Nicolas Maduro AI Video Shows US Military Operation in Venezuela
  • 1 నిమిషం 54 సెకన్ల వీడియో వైరల్
  • టెర్రస్‌పై మదురో చేతిలో గ్లాస్ పట్టుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లుగా వీడియో
  • విమానాలు అతని ఇంటిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నట్లు ఏఐ వీడియో
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌లను అమెరికా సైన్యం ఒక ఆపరేషన్ ద్వారా ఎలా పట్టుకుందో తెలుపుతూ ఒక 'ఏఐ' జనరేటెడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. 1 నిమిషం 54 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో, మదురో నివాసం వద్ద పేలుళ్లు జరిగినట్లు, అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నట్లు చూపబడింది.

మదురో తన నివాసంలోని టెర్రస్‌పై చేతిలో గ్లాసు పట్టుకుని ఏదో తాగుతూ ఆలోచిస్తుంటాడు. అదే సమయంలో ఆయన భార్య అక్కడకి వస్తుంది. అప్పుడు అమెరికా సైన్యానికి చెందిన విమానాలు అక్కడకు చేరుకుని, వారి నివాసాన్ని చుట్టుముట్టినట్లుగా వీడియోలో ఉంది. విమానంలోని సిబ్బంది లక్ష్యాన్ని చేరుకున్నట్లు ట్రంప్‌కు చెబుతున్నట్లు కూడా ఉంది. ఆ తర్వాత బాంబులు జారవిడుస్తారు.

ప్రమాదాన్ని పసిగట్టిన మదురో తన భార్యతో కలిసి సురక్షిత ప్రాంతానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అప్పటికే నివాసంలోకి ప్రవేశించిన అమెరికా బలగాలు మదురో సెక్యూరిటీ అధికారిని కాల్చి చంపి, దంపతులిద్దరినీ అదుపులోకి తీసుకుంటాయి. ఈ వీడియోకు లక్షలాది వ్యూస్ వచ్చాయి.
Nicolas Maduro
Maduro
Venezuela
Cilia Flores
US Military
AI Video
Venezuela President
Military Operation

More Telugu News