Uttam Kumar Reddy: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు... తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కీలక బాధ్యతలు

Uttam Kumar Reddy Given Key Responsibilities for Tamil Nadu Elections
  • ఏఐసీసీ పరిశీలకుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియామకం
  • తమిళనాడుతో పాటు పుదుచ్చేరి ఏఐసీసీ పరిశీలకుడిగా మంత్రి
  • అసోం, కేరళ, తమిళనాడు, బెంగాల్, పుదుచ్చేరిలకు పరిశీలకుల నియామకం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ సంవత్సరం తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో ఎన్నికలకు ఏఐసీసీ పరిశీలకుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు.

నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పర్యవేక్షణకు ఏఐసీసీ సీనియర్ పరిశీలకులను నియమించింది. అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

అసోం ఎన్నికల పరిశీలకులుగా భూపేష్ భగేల్, డీకే శివకుమార్, బందు టిర్కి, కేరళకు సచిన్ పైలట్, కేజే జార్జ్, ఇమ్రాన్, కన్హయ్య కుమార్, తమిళనాడు, పుదుచ్చేరికి ముకుల్ వాస్కీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖాజీ మహమ్మద్ నిజాముద్దీన్, పశ్చిమ బెంగాల్‌కు సుదీప్ రాయ్ బర్మన్, షకీల్ అహ్మద్ ఖాన్, ప్రకాశ్ జోషిలను నియమించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
Uttam Kumar Reddy
Tamil Nadu Elections
Telangana Minister
AICC
Assembly Elections 2024
Congress Party

More Telugu News