యువ భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వైభవ్ సూర్యవంశీ
- 3-0 తేడాతో విజయం సాధించిన టీమిండియా
- 394 పరుగుల భారీ లక్ష్యంతో క్రీజులోకి దిగిన సౌతాఫ్రికా
- 35 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌట్
కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ 74 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్సర్లతో 127 పరుగులతో చెలరేగడంతో పాటు బౌలింగ్‌లో కూడా ఒక వికెట్ పడగొట్టాడు. ఆరోన్ జార్జి 106 బంతుల్లో 16 ఫోర్లతో 118 పరుగులు చేసి రాణించాడు. దక్షిణాఫ్రికా టాప్ 4 బ్యాటర్లలో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు.
పాల్ జేమ్స్ (41), డేనియల్ బోస్మాన్ (40), కార్న్ బోథా (30 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగిన పరుగులు చేశారు. భారత బౌలర్లలో కిషన్ కుమార్ సింగ్ 3 వికెట్లు, మహమ్మద్ ఎనాన్ 2 వికెట్లు పడగొట్టగా, హెనిల్ పటేల్, కనిష్క్ చౌహాన్, ఉదవ్ మోహన్, అంబరీష్, సూర్యవంశీ ఒక్కో వికెట్ తీశారు. వైభవ్ సూర్యవంశీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.