Chiranjeevi: చిరంజీవి, ప్రభాస్ నిర్మాతలు, అభిమానులకు హై టెన్షన్... తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభం

Chiranjeevi Prabhas Films High Tension at Telangana High Court
  • సంక్రాతికి వస్తున్న చిరు, ప్రభాస్ ల భారీ చిత్రాలు
  • టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోల కోసం హైకోర్టును ఆశ్రయించిన నిర్మాతలు
  • రెండు పిటిషన్లను విచారిస్తున్న ధర్మాసనం
రెండు భారీ సినిమాలు ఈ సంక్రాంతికి ప్రేక్షకులను అలరించనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన 'మన శంకరవరప్రసార్ గారు'... ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో నిర్మితమైన 'ది రాజాసాబ్' చిత్రాలు సంక్రాంతికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టికెట్ల రేట్ల పెంపుదల, ప్రీమియర్ షోల కోసం ఈ రెండు చిత్ర బృందాలు తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. 

ఇదే సమయంలో టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్ షోల కోసం తెలంగాణ హైకోర్టును చిత్ర బృందాలు ఆశ్రయించాయి. ఈ రెండు వేర్వేరు పిటిషన్లపై హైకోర్టులో కాసేపటి క్రితం విచారణ ప్రారంభమయింది. 

గతంలో 'అఖండ 2' సినిమా సమయంలో ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతించవద్దని రాష్ట్ర హోంశాఖను హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించింది. అయితే సింగిల్ బెంచ్ ఉత్తర్వులను చిత్ర యూనిట్ డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. ఈ క్రమంలో సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించడంతో 'అఖండ 2' గట్టెక్కింది. ఈ క్రమంలోనే మెగాస్టార్, ప్రభాస్ చిత్ర నిర్మాతలు కూడా హైకోర్టును ఆశ్రయించారు. నిర్మాతల తరపు న్యాయవాదులు వారి వాదనలను వినిసిస్తున్నారు హైకోర్టు ఎలాంటి తీర్పును వెలువరిస్తుందనే టెన్షన్ ప్రస్తుతం అందరిలో నెలకొంది.
Chiranjeevi
Prabhas
Manashankara Varaprasad Garu
The Raja Saab
Anil Ravipudi
Maruthi
Telangana High Court
Movie Ticket Prices
Sankranthi Movies
Tollywood

More Telugu News