Amartya Sen: నోబెల్ గ్రహీతకూ ‘సర్’ నోటీసులు.. టీఎంసీ ఫైర్

Amartya Sen Notice Row Abhishek Banerjee Criticizes Election Commission
  • పశ్చిమ బెంగాల్ లో కొనసాగుతున్న ఓటర్ జాబితా సమగ్ర సర్వే
  • అమర్త్యసేన్ కు నోటీసులు పంపిన ఎన్నికల సంఘం
  • ఎన్నికల సంఘంపై టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ విమర్శలు
పశ్చిమ బెంగాల్ లో ఓటర్ జాబితా సమగ్ర సవరణ కోసం చేపట్టిన సర్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సర్వేలో భాగంగా విచారణకు రావాలంటూ ఎన్నికల సంఘం పలువురు ఓటర్లకు నోటీసులు పంపింది. ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ కు కూడా ఈ నోటీసులు పంపడం వివాదాస్పదంగా మారింది. నోబెల్ గ్రహీతకు నోటీసులు పంపడంపై అధికార టీఎంసీ ఎంపీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. 

ఈ మేరకు మంగళవారం అమర్త్యసేన్ సొంత జిల్లా బీర్భూమ్ లో నిర్వహించిన ర్యాలీలో అభిషేక్ బెనర్జీ ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అభిషేక్ బెనర్జీ ఆరోపణలపై ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులు వెంటనే స్పందించారు. అమర్త్యసేన్ కు నోటీసులపై మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. అమర్త్యసేన్ పేరు విషయంలో చోటుచేసుకున్న స్పెల్లింగ్ మిస్టేక్ కారణంగా సిస్టం నోటీసులు పంపిందని, స్పెల్లింగ్ మిస్టేక్ సరిచేయాలని బూత్ లెవెల్ అధికారికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.

అమర్త్యసేన్ విచారణకు రావాల్సిన అవసరం లేదని వివరించారు. కాగా, రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పై అధికార టీఎంసీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. సర్వే పేరుతో టీఎంసీ అనుకూల ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Amartya Sen
Nobel laureate
West Bengal
TMC
Abhishek Banerjee
Election Commission
Voter list
Special Intensive Revision
Birbhum
Mamata Banerjee

More Telugu News