Wipro: ఉద్యోగులకు వర్క్ పాలసీని స్ట్రిక్ట్ చేసిన విప్రో

Wipro Tightens Work Policy for Employees
  • వారానికి 3 రోజులు ఆఫీస్‌కి వెళ్లాల్సిందేనంటున్న విప్రో 
  • రోజులో కనీసం 6 గంటలు ఆఫీస్‌లో పని చేయాల్సిందేనని రూల్
  • విప్రో నిర్ణయంపై ఉద్యోగుల్లో మిక్స్‌డ్ రియాక్షన్స్

టెక్ కంపెనీలు ఒక్కొక్కటిగా వర్క్ ఫ్రమ్ హోమ్ సడలింపులను తగ్గిస్తూ, ఆఫీస్ అటెండెన్స్‌ను కఠినతరం చేస్తున్నాయి. తాజాగా భారతీయ ఐటీ దిగ్గజం విప్రో కూడా తన హైబ్రిడ్ వర్క్ పాలసీని మరింత స్ట్రిక్ట్ చేసింది. వారానికి 3 రోజులు ఆఫీస్ రావాల్సిందేనని స్పష్టం చేసింది. ఇకపై ఆఫీస్ రోజుల్లో ఉద్యోగులు కనీసం 6 గంటలు ఆఫీస్‌లోనే ఉండాలి (స్వైప్ ఇన్ నుంచి స్వైప్ అవుట్ వరకు). రోజుకు 9 గంటలు పనిచేయాల్సి ఉండగా మిగిలిన 3 గంటల సమయం ఇంటి నుంచి చేసుకోవచ్చు. ఆఫీస్ అటెండెన్స్ రూల్స్ పాటించకపోతే లీవ్స్‌పై ప్రభావం పడుతుందని విప్రో తెలిపింది.


ప్రత్యేక పరిస్థితుల్లో (అనారోగ్యం, కుటుంబ సంరక్షణ) ఏడాదికి రిమోట్ వర్క్ డేస్ సౌకర్యం 15 రోజుల నుంచి 12 రోజులకు తగ్గించారు. విప్రో తీసుకున్న నిర్ణయం ఉద్యోగుల్లో మిక్స్‌డ్ రియాక్షన్స్ తెచ్చిపెడుతోంది. కొందరు ఆఫీస్ కల్చర్ మళ్లీ రావడం మంచిదని అంటుంటే, మరికొందరు ట్రాఫిక్, టైం మేనేజ్‌మెంట్ సమస్యలు ఎక్కువవుతాయని ఆందోళన చెందుతున్నారు.

Wipro
Wipro work policy
Hybrid work model
IT companies
Work from home
Office attendance
Employee attendance
Remote work
IT sector

More Telugu News