Kavitha: కవిత కాంగ్రెస్‌‍లో చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు: మల్‌రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్య

Kavitha May Join Congress Says Malreddy Rangareddy
  • దానం నాగేందర్, కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వస్తారని ఎవరూ అనుకోలేదని వ్యాఖ్య
  • కవిత కూడా కాంగ్రెస్‌లో చేరవచ్చని అభిప్రాయపడిన మల్‌రెడ్డి రంగారెడ్డి
  • నాకు మంత్రి పదవి ఇవ్వండి అంటూ హైకమాండ్ కు విజ్ఞప్తి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు. గతంలో దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని అనుకోలేదని, కానీ వారు వచ్చారని చెప్పారు. కవిత కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

తనకు మంత్రి పదవి ఇవ్వాలన్న రంగారెడ్డి

తనకు మంత్రి పదవి ఇవ్వాలని మల్‌రెడ్డి రంగారెడ్డి కోరారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకే నష్టం జరుగుతుందని అన్నారు. పార్టీ పెద్దలు తన విషయంలో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. రెండు కోట్ల మంది ప్రజలు ఉన్న జిల్లాకు ఇంతవరకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రంగారెడ్డి జిల్లా పేరు మారుస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మల్‌రెడ్డి స్పందిస్తూ, పేరు మార్పు తనకు ఇష్టం లేదని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు అయినా చేసుకోవచ్చని, జిల్లా పేరు మాత్రం మార్చవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ ఊపందుకుందని, భూముల ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతో ఎవరూ అమ్ముకోవడానికి ఆసక్తి చూపడం లేదని ఆయన తెలిపారు.

Kavitha
Kalvakuntla Kavitha
Malreddy Rangareddy
Telangana Congress
BRS Party
Telangana Politics

More Telugu News