Vijay: కరూర్ తొక్కిసలాట ఘటన... సినీ నటుడు విజయ్‌కు సీబీఐ నోటీసులు

CBI Issues Notice to Actor Vijay in Karur Stampede Case
  • ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న సీబీఐ
  • ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలన్న సీబీఐ
  • కరూర్ తొక్కిసలాట దుర్ఘటనలో 41 మంది మృతి
కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే అధినేత, ప్రముఖ నటుడు విజయ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12న ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ ఘటనపై సీబీఐ విచారణ కొనసాగుతోంది.

గత ఏడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్‌లో విజయ్ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా, 60 మంది గాయపడిన విషయం తెలిసిందే.

సుమారు 10 వేల మంది సామర్థ్యం కలిగిన సభాస్థలి వద్దకు దాదాపు 30,000 మంది రావడంతో తొక్కిసలాట జరిగింది. అంతేకాకుండా, విజయ్ బహిరంగ సభ వేదిక వద్ద భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించారని, సభకు హాజరైన వారికి సరైన ఆహారం, నీటి వసతులు కల్పించలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీబీఐ ఆయనకు నోటీసులు జారీ చేసింది.
Vijay
Actor Vijay
Karur stampede
CBI investigation
Tamil Nadu
TVK leader
Rally incident
Public safety

More Telugu News