Kalvakuntla Kavitha: కవితకు మద్దతుగా ఆమె ఇంటి వద్దకు భారీగా తరలివచ్చిన అభిమానులు

Kalvakuntla Kavitha Receives Massive Support at Her Residence
  • బాల్కనీలో నిలబడి అందరికీ అభివాదం చేసిన కవిత
  • కిందకు వచ్చి అందరినీ పలకరించిన వైనం
  • మీరే నా బలం అంటూ కవిత భావోద్వేగం

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటి వద్దకు భారీ సంఖ్యలో ఆమె అభిమానులు చేరుకున్నారు. 'తెలంగాణ జాగృతి'ని రాజకీయ శక్తిగా మార్చబోతున్నామని ఆమె ప్రకటించిన వెంటనే, రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నేతలు, ఉద్యమ కార్యకర్తలు భారీగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆమె నివాసం వద్దకు తరలివచ్చారు.


ఈ సందర్భంగా కవిత తన ఇంటి బాల్కనీలో నిలబడి అందరికీ చేతులు జోడించి అభివాదం చేశారు. తర్వాత కిందకు వచ్చి ప్రతి ఒక్కరినీ పలకరించారు. “ఎలా ఉన్నారు? ఇంట్లో అందరూ బాగున్నారా?” అంటూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.


ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తన వెన్నంటి ఉండి, ఇప్పుడు కష్టకాలంలో కూడా మద్దతుగా నిలిచిన ఉద్యమకారులను చూసి కవిత భావోద్వేగానికి లోనయ్యారు. కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె గొంతు కంపిస్తూ “మీరు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. మీరు నా బలం” అంటూ మాట్లాడారు.


ఈ సందర్భంలో అక్కడి పరిసర ప్రాంతాలు నినాదాలతో మారుమోగాయి. "జై తెలంగాణ... కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి... తెలంగాణ జాగృతి జిందాబాద్" అంటూ నినాదాలు చేశారు. “ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న కవితకు అండగా ఉంటాం. తెలంగాణ జాగృతి ద్వారా ప్రజల కోసం పనిచేస్తాం” అని నినదించారు.


మరోవైపు, రాజకీయ శక్తిగా అవతరించబోతున్నామంటూ కవిత చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయింది. కవిత రాజకీయ పార్టీని ప్రకటిస్తే... రాష్ట్ర రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Kalvakuntla Kavitha
Kavitha
Telangana Jagruthi
BRS
Telangana politics
Telangana activists
political support
Hyderabad
Telangana movement
political party

More Telugu News