Vaibhav Suryavanshi: కొనసాగుతున్న సంచలనాల మోత... పంత్ రికార్డు బద్దలుకొట్టిన వైభవ్

Vaibhav Suryavanshi Fastest Half Century in Youth ODI Beats Pant
  • యూత్‌ వన్డేల్లో సరికొత్త రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
  • 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి రిషభ్ పంత్ రికార్డు బ్రేక్
  • 24 బంతుల్లో 10 సిక్సర్లతో 68 పరుగులు చేసిన 14 ఏళ్ల వైభవ్
  • దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుపై భారత్ ఘన విజయం
భారత క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ సంచలనాలు కొనసాగుతున్నాయి. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తాజాగా టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డును బద్దలుకొట్టాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన యూత్ వన్డేలో కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

నిన్న‌ బెనోనిలో దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో జరిగిన రెండో యూత్ వన్డేలో ఈ అద్భుతం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన వైభవ్, ఆరంభం నుంచే విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. మొత్తం 24 బంతులు ఎదుర్కొని 10 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 68 పరుగులు చేశాడు. అతని స్కోరులో 64 పరుగులు బౌండరీల ద్వారానే రావడం విశేషం. గతంలో రిషభ్ పంత్ 18 బంతుల్లో ఈ ఫీట్ సాధించగా, వైభవ్ దానిని అధిగమించాడు.

ఈ మ్యాచ్‌లో వర్షం కారణంగా భారత్‌కు 27 ఓవర్లలో 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. లక్ష్య ఛేదనలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్, దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతను ఔటైన తర్వాత వేదాంత్ త్రివేది (31 నాటౌట్), అభిగ్యాన్ కుందు (48 నాటౌట్) నిలకడగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు.
Vaibhav Suryavanshi
Rishabh Pant
India Under 19
Youth ODI
Fastest Half Century
South Africa Under 19
Cricket Record
Vedant Trivedi
Abhigyan Kundu

More Telugu News