Roja: రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నావు..?: పవన్ ను నిలదీసిన రోజా

Roja slams Chandrababu accuses betrayal of Rayalaseema region
  • రాయలసీమ-నీళ్లు అంశంపై రోజా స్పందన
  • రాయలసీమకు వెన్నుపోటు పొడిచారంటూ చంద్రబాబుపై విమర్శలు
  • ఓటుకు నోటు కేసులో మీ తోడుదొంగ ఈ విషయం చెబుతున్నాడని ఫైర్
కూటమి పాలనలో రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని వైసీపీ నేత, ఏపీ మాజీ మంత్రి రోజా ఆరోపించారు. మంగళవారం ఉదయం నెల్లూరు జిల్లా జైలులో పిన్నెల్లి సోదరులను రోజా పరామర్శించారు. అనంతరం, ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం చూశాం... రాయలసీమ ద్రోహులు ఎవరో ఆయన మాటలతోనే స్పష్టమైందని రోజా అన్నారు. సీఎం చంద్రబాబు రాయలసీమను మోసం చేస్తున్నాడని ఓటుకు నోటు కేసులో ఆయన పార్టనరే చెబుతున్నాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆ రోజు రాష్ట్ర విభజనకు సంతకం చేసి నాశనం చేశావు... ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ ప్రాజెక్టును ఆపివేయించి అన్యాయం చేస్తున్నావు అని రోజా మండిపడ్డారు. హైదరాబాద్‌ లోని మీ ఆస్తులు కాపాడుకోవడానికి రాయలసీమను ఎలా తాకట్టు పెడతారని విమర్శించారు. రాయలసీమ అంటే ప్రాణమని చెప్పే పవన్ కల్యాణ్, రాయలసీమకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని రోజా నిలదీశారు. ‘ఇందుకేనా నువ్వు పార్టీ పెట్టింది.. ఇందుకేనా కూటమిలో చేరింది.. ఇందుకేనా చంద్రబాబును గెలిపించింది’ అంటూ పవన్ కల్యాణ్ పై రోజా తీవ్రంగా మండిపడ్డారు.

అధికారులకు రోజా బెదిరింపులు..
రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులు సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేశ్ కు భజన బ్యాచ్ లా తయారయ్యారని రోజా మండిపడ్డారు. పిన్నెల్లి సోదరులపై కక్షగట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ఖాకీ చొక్కాలు వేసుకోవాల్సిన పోలీసులు పసుపు చొక్కాలు ధరిస్తున్నారని విమర్శించారు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పిన్నెల్లి సోదరులకు భోజనం పెట్టడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇంతకు పదింతలు చెల్లించుకుంటారని అధికారులను బెదిరించారు.
Roja
Roja Selvamani
Rayalaseema
Chandrababu Naidu
Pawan Kalyan
Pinnelli brothers
Andhra Pradesh politics
YS Jagan
Nellore
Telugu Desam Party

More Telugu News