Yuvraj Singh: హైదరాబాద్‌లో యువరాజ్ సింగ్ సందడి.. ఇదిగో వీడియో!

Yuvraj Singh Visits Hyderabad for Big Academy Opening
  • నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న భారత మాజీ క్రికెటర్ 
  • శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన అభిమానులు
  • నోవాటెల్‌లో జరగనున్న బిగ్ అకాడమీ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న యువీ
  • ఈ అకాడమీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న యువరాజ్ సింగ్
భారత మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నాడు. నిన్న రాత్రి నగరానికి చేరుకున్న ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. తమ అభిమాన క్రికెటర్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఈరోజు సాయంత్రం 5 గంటలకు నోవాటెల్‌లో జరగనున్న 'బిగ్ అకాడమీ' గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి యువరాజ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు. ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్ ఇచ్చే ఈ అకాడమీకి ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రారంభోత్సవంలో భాగంగానే యువరాజ్ నగరానికి వచ్చాడు.
Yuvraj Singh
Yuvraj Singh Hyderabad
Big Academy
IIT JEE Coaching
NEET Coaching
Novotel Hyderabad
Shamsabad Airport
Cricket
Brand Ambassador

More Telugu News