Mahindra XUV 7XO: సరికొత్త హంగులతో మహీంద్రా XUV 7XO లాంచ్.. రూ. 13.66 లక్షల ప్రారంభ ధరతో 'టెక్' విప్లవం

Mahindra XUV 7XO Launched with New Features and Tech
  • XUV 700 సిరీస్‌లో మరింత ప్రీమియం లుక్‌లో వచ్చిన XUV 7XO
  • భారతీయ ICE కార్లలోనే తొలిసారిగా 'ట్రిపుల్ స్క్రీన్' డ్యాష్‌బోర్డ్
  • లెవల్ 2 ADAS, 7 ఎయిర్‌బ్యాగ్స్ సహా 120కి పైగా అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు
  • ఈ నెల 14 నుంచి బుకింగ్స్ ప్రారంభం.. ఆ రోజే డెలివరీలు కూడా మొదలు
భారతీయ ఎస్‌యూవీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన ప్రతిష్ఠాత్మక 'XUV 7XO'ను దేశీయ మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. గతంలో భారీ విజయం సాధించిన XUV 700కు ఇది అడ్వాన్స్‌డ్ వెర్షన్. దీని ప్రారంభ ధరను రూ. 13.66 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) సంస్థ నిర్ణయించింది. కేవలం పేరు మాత్రమే కాకుండా, డిజైన్, టెక్నాలజీ పరంగా ఈ కారు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

XUV 7XO డిజైన్ చూస్తే, పాత మోడల్ పోలికలు ఉన్నప్పటికీ మరింత షార్ప్‌గా, ప్రీమియంగా కనిపిస్తోంది. ముందు భాగంలో కొత్త పియానో బ్లాక్ గ్రిల్, మెరిసే 'టాలోన్' యాక్సెంట్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక కారు లోపల (ఇంటీరియర్) ఏకంగా మూడు స్క్రీన్ల (31.24 సెం.మీ) లేఅవుట్‌ను ఇచ్చారు. ఇది భారతదేశంలో ఏ పెట్రోల్/డీజిల్ ఎస్‌యూవీలోనూ లేని ప్రత్యేకత. ప్రీమియం లెదర్ సీట్లు, 16-స్పీకర్ల హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, డాల్బీ అట్మోస్ వంటి ఫీచర్లు కారును రోడ్డుపై వెళ్లే ఒక థియేటర్‌లా మార్చేశాయి.  ఈ కారులో మహీంద్రా కొత్తగా 'DAVINCI' సస్పెన్షన్ సిస్టమ్‌ను పరిచయం చేసింది. ఇది గుంతల రోడ్లపై కూడా సాఫీగా వెళ్లేలా కారును నియంత్రిస్తుంది.

పెట్రోల్: 2.0 లీటర్ ఇంజన్ (197 bhp పవర్)
డీజిల్: 2.2 లీటర్ ఇంజన్ (185 bhp పవర్)

రెండింటిలోనూ 6-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. డీజిల్ వేరియంట్‌లో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సౌకర్యం కూడా లభిస్తుంది.

XUV 7XOలో 120కి పైగా భద్రతా ఫీచర్లు ఉన్నాయి. భారత్ NCAP ప్రమాణాల ప్రకారం 5-స్టార్ రేటింగ్ సాధించేలా దీన్ని రూపొందించారు. లెవల్ 2 ADAS ద్వారా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి 17 రకాల డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

జనవరి 14 (సంక్రాంతి) నుంచి అధికారికంగా బుకింగ్స్ మొదలవుతాయి. టాప్ ఎండ్ వేరియంట్లు (AX7, AX7T, AX7L) బుక్ చేసుకున్న వారికి అదే రోజు నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. బేస్ వేరియంట్లు (AX, AX3, AX5) మాత్రం ఏప్రిల్ 2026 నుంచి అందుబాటులోకి వస్తాయి.
Mahindra XUV 7XO
Mahindra
XUV 7XO
SUV
Car Launch
Indian Car Market
Automobile
ADAS
DAVINCI Suspension
Harman Kardon

More Telugu News