నిఖిత కుటుంబానికి సహాయం చేస్తాం: కిషన్ రెడ్డి
- ఆమెరికాలో గోడిశాల నిఖిత హత్యపై విచారం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
- విషయం తెలియగానే విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మాట్లాడానన్న కిషన్ రెడ్డి
- అవసరమైన అన్ని విధాల సహాయాన్ని అందిస్తున్నామని వెల్లడి
నిఖిత మృతి విషయం తెలియగానే తాను జర్మనీ పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మాట్లాడి, మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అవసరమైన సహకారం అందించాలని కోరడం జరిగిందన్నారు. ఈ విషయంలో ఢిల్లీలోని తన కార్యాలయం, తెలంగాణ బీజేపీ కార్యాలయం నిఖిత కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ అవసరమైన సహాయాన్ని అందిస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు.