Chandrababu Naidu: మారిషస్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు మర్యాద పూర్వక భేటీ... ఫొటోలు ఇవిగో!

Chandrababu Naidu Meets Mauritius President Dharam Beer Gokool
  • గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు
  • హాజరైన మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్‌
  • ఈ కార్యక్రమం అనంతరం ధరమ్ బీర్ గోకుల్ తో చంద్రబాబు సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్‌తో సోమవారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమం ముగిసిన అనంతరం వీరి భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్‌ నేడు ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సమావేశంలో ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మారిషస్ అధ్యక్షుడికి వివరించారు. అలాగే, మారిషస్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. దీనికి స్పందించిన ధరమ్ బీర్ గోకుల్, గతంలో చంద్రబాబు మారిషస్‌లో పర్యటించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.

ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరయ్యేందుకే మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగానే ఆయన ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.
.
Chandrababu Naidu
Mauritius
Dharam Beer Gokool
World Telugu Conference
Guntur
Andhra Pradesh
Telugu People
Mauritius President Visit
AP Development
Telugu Diaspora

More Telugu News